సత్యమేవ జయతే సాంగ్ లిరిక్స్ తెలుగు

  • by
సత్యమేవ జయతే సాంగ్ లిరిక్స్ తెలుగు

This article is providing సత్యమేవ జయతే సాంగ్ లిరిక్స్ తెలుగు 

జన జన జన జనగణమున కలగలిసిన జనం మనిషిరా
మన మన మన మనతరపున నిలబడగల నిజం మనిషిరా
నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా
పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా

వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే
ఇతనిలా ఓ గళం మన వెన్నుదన్నై పోరాడితే

సత్యమేవ జయతే
సత్యమేవ జయతే
సత్యమేవ జయతే
సత్యమేవ జయతే

జన జన జన జనగణమున కలగలిసిన జనం మనిషిరా
మన మన మన మనతరపున నిలబడగల నిజం మనిషిరా
నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా
పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా

గుండెతో స్పందిస్తాడు అండగా చెయ్యందిస్తాడు….

ఇలా చెంప జారెడి
ఆఖరి అశ్రువునాపెడివరకు అనునిత్యం
బలహీనులందరి ఉమ్మడి గొంతుగ
పోరాటమే తన కర్తవ్యం

వకాల్తా పుచ్చుకుని వాదించే ఈ వకీలు
పేదోళ్ళ పక్కనుండి కట్టిస్తాడు బాకీలు
బెత్తంలా చుర్రుమని కక్కిస్తాడు నిజాలు
మొత్తంగా న్యాయానికి పెట్టిస్తాడు దండాలు
ఇట్టాంటి ఒక్కడుంటే అంతే చాలంతే
గొంతెత్తి ప్రశించాడో అంతా నిశ్చింతే
ఇట్టాంటి అన్యాయాలు తలెత్తవంతే
మోరెత్తే మోసగాళ్ళ పత్తా గల్లంతే

సత్యమేవ జయతే
సత్యమేవ జయతే
సత్యమేవ జయతే
సత్యమేవ జయతే
సత్యమేవ జయతే

–  Sathyameva Jayathe Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *