నీ చిత్రం చూసి లిరిక్స్ తెలుగు

  • by
నీ చిత్రం చూసి లిరిక్స్ తెలుగు

This article is providing నీ చిత్రం చూసి లిరిక్స్ తెలుగు

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో….
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో….

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో….
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో….

నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందు
నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో…

ఈ దారిలోని గందరగోళాలే
మంగళ వాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో
మన పెళ్ళీ మంత్రాలుగా
అటు వైపు నీవు నీ వైపు నేను
వేసేటి అడుగులే ఏడు అడుగులని
ఏడు జన్మలకి ఏకమై పోదామా…

ఎంత చిత్రం ప్రేమ
వింత వీలునామ రాసింది మనకు ప్రేమా
నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి
వెళ్లి పొమ్మంటుంది ప్రేమా…

ఈ కాలం కన్న ఒక క్షణం ముందే
నే గెలిచి వస్తానని
నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి
నిను ఊరేగిస్తానని
ఆకాశమంత మన ప్రేమలోని
ఏ చీకటైన క్షణకాలమంటు
నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని..

ఎంత చిత్రం ప్రేమ
వింత వీలునామ రాసింది మనకు ప్రేమా…

 – Nee Chitram Choosi Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *