చంచల్ గూడ జైలులో లిరిక్స్

  • by
చంచల్ గూడ జైలులో లిరిక్స్

This article is providing చంచల్ గూడ జైలులో లిరిక్స్ from the film JathiRatnalu

చంచల్ గూడ జైలులో
చిలకలయ్యి చిక్కారు
పలకమీదికెక్కిందయ్యో నెంబరు
సుక్కలందుకోని రెక్కలు విప్పి
తుర్రుమంటూ ఎగిరారు
వీళ్ళ గాచారమే గుంజి తంతే
బొక్కలో పడ్డారు

ఏ నిమిషానికి ఏమి జరుగునో
పాటకు అర్థమే తెలిసొచ్చేనే
వెన్న తిన్న నోటితో మన్ను బుక్కిస్తిరే
ఏమి గానున్నదో ఏందో రాత
రంగు రంగుల పాల పొంగులా
మస్తు మస్తు కలలు కంటే
సిట్టి గుండెకే చెప్పకుండనే ఆశ పుట్టెనే

నీళ్ళలో సల్లగా బతికేటి చేపనే ఒడ్డుకే ఏస్తిరే
యమ తోమ బడితిరే
ఇంటినున్న పుల్ల తీసి అటు పెట్టనోనికి
నెత్తి మీద బండ పెట్టి ఉరికిస్తుండ్రే

అరె మారాజు తీరే ఉన్నోన్ని
ఏ రందీ లేనోన్ని
బతుకాగం చెసిండ్రే
ఓ బొందల తోసిండ్రే

అరె బేటా మీరు ఏది పట్టినా
అది సర్వనాశనం ఇది దైవశాసనం
ఇంట్ల ఉన్నన్నినాళ్ళు
విలువ తెలువలేదురో
కర్మ కాలిపోయినంక కథే మారెరో

ఖైదీ బట్టలు రౌడీ గ్యాంగులు
నాలుగు గోడలే నీ దోస్తులాయెరో
అవ్వ పాయెరో బువ్వ పాయెరో
పోరి తోటి లవ్వే పాయే
ముద్దుగున్న మీ లైఫు అందమే పలిగి పాయెరో

– Chanchalguda Jail Lo Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *